ఫుడ్ ఫెస్టివల్‌లో కాల్పులు..షాకింగ్!

4
- Advertisement -

అమెరికాలోని సీటెల్‌లో ఉన్న ప్రముఖ ‘స్పేస్ నీడిల్’ (Space Needle) టవర్‌కు కూతవేటు దూరంలో జరిగిన ఒక ఫుడ్ ఫెస్టివల్‌లో కాల్పుల కలకలం చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో కనీసం ఇద్దరు మరణించగా మరో ఐదుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సీటెల్ సెంటర్‌లో జరిగిన ఈ తుపాకీ దాడికి సంబంధించి ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా లేదా అనే దానిపై స్పష్టత లేదు.

పోలీసులు కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పలువురికి గాయాలయ్యాయి. సీటెల్ సెంటర్‌లో కాల్పులు జరిగాయి. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం. దయచేసి ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దు అని సీటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎక్స్ (X)లో పేర్కొంది.

ధితులను హార్బర్‌వ్యూ మెడికల్ సెంటర్‌కు తరలించినట్లు ‘సీటెల్ టైమ్స్’ నివేదిక తెలిపింది. వందలాది స్థానిక వ్యాపారులు, లైవ్ సంగీత ప్రదర్శనలతో సీటెల్ సెంటర్‌లో ఏటా నిర్వహించే ‘బైట్ ఆఫ్ సీటెల్’ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

Also Read:‘నేను రెడీ’..పెద్ద విజయం సాధించాలి!

- Advertisement -