- Advertisement -
మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం మాస్ జాతర బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేదు. శ్రీలీల ముఖ్య పాత్రలో నటించడంతో పాటు భాను బొగవరపు దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల విషయంలో అంతగా ప్రభావం చూపలేకపోయింది.
ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ విడుదలకు సిద్ధమవుతోంది. నవంబర్ 28, 2025 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమా పతాకాలపై నిర్మితమైన ఈ చిత్రానికి భీమ్స్ సేసిరోలియో సంగీతం అందించారు. రాజేంద్ర ప్రసాద్, నితీష్ నిర్మల్, కృష్ణ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వెండితెరపై నిరాశపర్చిన ఈ చిత్రం ఓటీటీలో ఏమేరకు అలరిస్తుందో వేచిచూడాలి.
Also Read:స్మృతి మంధాన–పలాష్ పెళ్లి బ్రేక్!
- Advertisement -

