మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్స్ లో బోయపాటి శ్రీను మార్క్ మర్చిపోలేనిది. హీరోలను ఊరమాస్‌గా చూపించడంలో బోయపాటి దిట్ట. ఈయన సినిమాలోని హీరో..సినిమా రిలీజ్ అయ్యాకే ఊరమాస్ అనిపించుకుంటాడు. కానీ అంతకంటే ముందే..బోయపాటి ఊరమాస్ డైరెక్టర్ అని ఫిక్సైపోతారు సినీ లవర్స్.
ఇదిలా ఉంటే…ఇటీవలే రిలీజ్ అయిన‘జయ జానకి నాయక’ సినిమా తరువాత బోయపాటి శ్రీను ఎవరితో సినిమా చేస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.
చిరంజీవి, బాలకృష్ణ, అఖిల్.. ఈ ముగ్గురిలో ఎవరితోనైనా ఆయన సినిమా చేసే ఛాన్స్ ఉందని ఫిల్మ్ నగర్ టాక్. ఈ నేపథ్యంలో తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ బోయపాటితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇప్పుడు బోయపాటి దృష్టి పవన్‌పై పడింది. త్రివిక్రమ్ సినిమా పూర్తయిన వెంటనే.. పవన్.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో సినిమా చేయనున్నాడు. ఆ సినిమాకు సంతోష్ శ్రీనివాస్ దర్శకుడని తెలుస్తోంది.
ఒకవేళ బోయపాటి గనుక రంగంలోకి దిగితే.. ఈ కాంబినేషన్ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే…శ్రీనివాస్‌ను కాదని పవన్ సినిమాకు బోయపాటిని ఎంచుకున్నా.. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.