Masala Chai:మసాలా టీ తాగుతున్నారా..అయితే?

54
- Advertisement -

చాలామందికి ప్రతిరోజూ టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కొందరైతే రోజుకు అయిదు నుంచి ఆరు సార్లు కూడా టీ లేదా కాఫీ తాగుతూ ఉంటారు. ఇలాంటి వారు టీ లేదా కాఫీ తాగే అలవాటు మానుకోవడం కష్టమనే చెప్పాలి. ఇక ఈ టీ లేదా కాఫీ లలో చాలా రకాలే ఉన్నాయి. వాటిలో మసాలా టీ కూడా ఒకటి. చాలా మంది మసాలా టీ తాగడానికి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇందుకంటే ఇందులో వాడే దాల్చిన చెక్కా, లవంగాలు, యాలకలు, జాజికాయ, అల్లం వంటి మసాలా దినుసుల కారణంగా మసాలా టీ ఎంతో ఘాటును కల్గి ఉంటుంది. అందువల్ల ఈ మసాలా టీ తాగడానికి కొందరు ఇష్టపడరు. అయితే సాధారణ టీ కంటే కూడా మసాలా టీ ప్రతి రోజు తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మసాలా టీ లో వాడే ఇంగ్రిడియన్స్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందట. .

అంతే కాకుండా జీవక్రియను మెరుగుపరచడం, అన్నీ భాగాలకు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా మసాలా టీ ఎంతగానో దోహదపడుతుందట. సాధారణ టీ లో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ కెఫీన్ అధికంగా తీసుకోవడం కూడా ప్రమాదమే.. అయితే మసాలా టీలో మాత్రం కెఫీన్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల మసాలా టీ తాగడం అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ చలికాలంలో మసాలా టీ తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు దరిచేరవు. మసాలా టీ లో వాడే దినుసులలో యాంటీ ఇన్ ఫ్లామేషన్ గుణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల మసాలా టీ తాగడం వల్ల శరీరంలోని నొప్పులు, వాపులు వంటివి తగ్గుతాయి. అంతే కాకుండా మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు కూడా మసాలా టీ తగ్గిస్తుంది. దీనికి కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకుంటే శరీర బరువు కూడా సులభంగా తగ్గవచ్చు. అందువల్ల మనం తరచూ తాగే సాధారణ టీ లేదా కాఫీ కంటే.. ఈ మసాలా టీ ని తాగడం అలవాటు చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి…

- Advertisement -