గోపిచంద్‌ హీరోగా మారుతి మూవీ!

420
gopichand
- Advertisement -

కొంతకాలంగా సక్సెస్ కోసం వేచిచూస్తున్న హీరో గోపిచంద్‌. హిట్, ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుస సినిమాలు చేస్తున్న గోపిచంద్…సక్సెస్ రుచి చూసి చాలాకాలం అయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రెండు సినిమాలు లైన్లో ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గోపిచంద్.

క్లాస్ సినిమాల దర్శకుడు మారుతితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట గోపిచంద్. లాక్ డౌన్‌ సమయంలో మారుతి అద్భుతమైన కథను సిద్ధం చేయగా ఇందుకు గోపిచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

ప్రస్తుతం సంపత్ నందితో సీటీమార్,ఆ తర్వాత తేజ దర్శకత్వంలో గోపిచంద్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత మారుతి- గోపిచంద్ సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -