‘వెరే చెత్త సినిమాతో పోల్చట్లేదు’..

245
- Advertisement -

భలే భలే మగాడివోయ్’ సినిమాతో రెండేళ్ల కిందట భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు మారుతి. అయితే మారుతి లెటెస్ట్‌ సినిమా ‘మహానుభావుడు’ ప్రమోషన్ల సందర్భంగా ‘బాబు బంగారం’ ఫలితం గురించి ప్రస్తావిస్తే… ‘‘ఒక పెద్ద హీరోతో అలాంటి కథ చేయాలనుకున్నాను.

అలాగే చేశాను. నేను ఎంత సక్సెస్ అయితే అనుకున్నానో అంత సక్సెస్ వచ్చింది.  అది నాకు ఓకే. ఆ సినిమా వల్ల చాలామంది హ్యపీ. కానీ ఆ కథను ఇంకా బాగా చేసి ఉండొచ్చు అనే ఫీలింగ్ అయితే ఇప్పటికీ నాలో ఉంది’’ అని మారుతి అన్నాడు.

 maruthi talk about mahanubhavudu movie

ఇక తన కొత్త సినిమా ‘మహానుభావుడు’ను ‘భలే భలే మగాడివోయ్’తో పోలుస్తుండటంపై మారుతి స్పందిస్తూ.. ‘‘మంచిదే కదా. ఆ సినిమాను కూడా నేనే డైరెక్ట్ చేశాను. నా సినిమాను వేరే చెత్త సినిమాతో కాకుండా నేను తీసిన హిట్ సినిమాతోనే పోలుస్తున్నారు’’ అని చెప్పాడు.

మొత్తానకి ఎక్కువ కొత్త వాళ్లు.. పెద్దగా పేరు లేని వాళ్లతో చిన్న సినిమాలు  తీస్తూ.. హిట్లు కొడుతూ మారుతి సాగిపోతున్నాడు. ఇక ఈ సినిమా కూడా తన రేంజ్ ఎంతో పెంచుతుందో చూడాలి.

- Advertisement -