ప్ర‌భాస్‌తో మూవీ.. డైరెక్టర్‌ మారుతి క్లారిటీ..

91
- Advertisement -

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్నట్లు వార్త‌లు చక్కర్లు కొడుతున్నాయి. కాగా, ప్రభాస్‌ డీవీవీ దానయ్య నిర్మాణంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే ఇటీవల డీవీవీని డైరెక్టర్‌ మారుతి క‌లిసి ఓ క‌థ చెప్పార‌ని, ఇందులో హీరోగా ప్ర‌భాస్ న‌టిస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ ప్ర‌చారంపై మారుతి క్లారిటీ ఇచ్చారు. త‌న‌ భవిష్యత్తు ప్రాజక్టులు, వాటి టైటిల్స్‌, ఇతర అంశాల‌పై ప‌లు ర‌కాల ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని.. అయితే, సమయమే అన్నింటినీ బయటపెడుతుందని, అప్పటి వరకూ వేచి ఉండాల‌ని ఆయ‌న తెలిపారు. త‌న‌ను దర్శకుడిగా సపోర్ట్‌ చేస్తోన్న వారందరికీ ధన్యవాదాలు చెబుతున్న‌ట్లు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. కాగా,ప్రస్తుతం కరోనా తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోంద‌ని, అంద‌రూ జాగ్రత్తగా ఉండాల‌ని ఆయన సూచించారు.

- Advertisement -