మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం ది రాజా సాబ్. ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు మారుతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు మారుతి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అంచనాలను మరింత పెంచారు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాలో చూపించబోయే భూతం ప్రేక్షకులు ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా ఉంటుందని, అదే సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తుందని మారుతి తెలిపారు.
సాధారణ హారర్ టెంప్లేట్‌ను అనుసరించకుండా, భయానక అంశాన్ని ఫాంటసీ ఆధారిత అనుభవంగా మలిచామని ఆయన వెల్లడించారు. దీంతో సినిమా కొత్తగా, వినోదాత్మకంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. ఈ వినూత్న ఆలోచన కుటుంబ ప్రేక్షకులతో బలమైన అనుబంధాన్ని ఏర్పరుస్తుందని కూడా మారుతి ధీమా వ్యక్తం చేశారు.
ప్రభాస్ పాత్ర ఈ సినిమాకు మరో పెద్ద ఆకర్షణగా నిలవనుందని చిత్రబృందం చెబుతోంది. హారర్, ఫాంటసీ, వినోదాన్ని మేళవిస్తూ రూపొందుతున్న ది రాజా సాబ్ సినిమా ప్రేక్షకులకు ఓ ప్రత్యేక అనుభూతిని కలిగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు మారుతి.
Also Read:‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’..అప్‌డేట్

