- Advertisement -
నెల్లూరు జిల్లా మర్రిపాడు సచివాలయంలో ఓటిఎస్ అవగాహన కార్యక్రమంలో ఎంపీడీవో సుస్మిత రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇటీవలే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ నిర్వహించి తమ ప్రభుత్వం రాగానే ప్రజలకు ఉచితంగా పట్టాలు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసింది. చంద్రబాబునాయుడు మాట్లాడిన మాటలను ఉద్దేశించి ఎంపీడీవో సుస్మిత రెడ్డి స్పందించారు. ప్రజలపై గత ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ఉచితంగా పట్టాలు, రుణమాఫీలు ఎందుకు ఇవ్వలేదు అంటూ విమర్శలు గుప్పించింది. ప్రజలు తమ బుద్ధుని వాడాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. వైసీపీ పాలన బాగుందంటూ వెనకేసుకొచ్చింది ఎంపీడీవో.
- Advertisement -