తెలుగు రాష్ట్రాల్లో… పెళ్లి సందడి

397
Marriage Season Starts In Telugu States
- Advertisement -

శుభప్రదమైన శ్రావణమాసం….మోగాయి పెళ్లి బాజాలు.  పెళ్లి పందిళ్లు, మంగళ వాయిద్యాలు, విందు భోజనాలు, బంధువులతో సందళ్లు… గురువారం నుంచి వారం పాటు రాష్ట్రమంతా పెళ్లిళ్లతో కళకళలాడనుంది. గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలకూ ఇదే మంచి సమయం.  శ్రావణ పౌర్ణమి తరువాత ‘నక్షత్రానికి’ బలం ఎక్కువగా ఉండడంతో… వేల సంఖ్యలో పెళ్లిళ్లకు ముహూర్తాలు కుదిరాయి. నగల షాపులు, వస్త్ర దుకాణాలు కొనుగోలు దారులతో కిటకిటలాడుతున్నాయి.

శుభగడియలకు తోడు సెలవులు కూడా తోడవడంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల శోభ ఉట్టిపడనుంది. శుక్రవారం(ఆగస్టు-11) నుంచి మొదలు.. 12, 13, 16 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కల్యాణ కాంతులే అబ్బురపరచనున్నాయి. చక్కని ముహూర్తాలు (లగ్నాలు) ఉండటం… శనివారం(ఆగస్టు-12) నుంచి నాలుగు రోజులు వరసగా సెలవులు ఉండటంతో ఈ ముహూర్తాలనే పెట్టుకున్నారు.

తెలంగాణ, ఏపీల్లో కలిపి లక్షకుపైగా జంటలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నాయిని అంచనా.   ముంచుకొచ్చిన ముహూర్తాలతో ఫంక్షన్‌హాళ్లు, కళ్యాణమంటపాలు ఎక్కడికక్కడ బుక్కయిపోయాయి. కొందరికి హాళ్లు దొరకడం కష్టంగా మారింది. పంక్షన్‌హాళ్లకు కొరత కారణంగా ఒకే వేదికలో ఉదయం పెళ్లి… సాయంత్రానికి రిసెప్షన్‌లు పెట్టుకుంటున్నారు. అలాగే చాలా చోట్లా ఒకే ఫంక్షన్‌ హాల్లో రెండు పుటలా పెళ్లిళ్లు జరగున్నాయి.

ఫంక్షన్‌హాళ్లు దొరకని వధూవరుల కుటుంబసభ్యులు కమ్యూనిటీ హాళ్లు, దేవాలయాల కోసం పరుగులు పెడుతున్నారు. ముహూర్తాల వరదతో ఒకే కుటుంబానికి బంధుమిత్రలు నుంచి పదులు సంఖ్యలో ఆహ్వానపత్రికలు వస్తున్నాయి. మొత్తంగా హాలీడేస్ పెళ్లిళ్ల సందడితో అలా గడిచిపోనున్నాయి.

మరోవైపు వరుస సెలవులతో ప్రముఖ దేవాలయాలన్ని కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.

- Advertisement -