పెళ్లిళ్ల సీజన్ షురూ..

4
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెళ్లి సందడి షురూ అయ్యింది. ఆగస్టు చివర వారం వరకు పెళ్లి ముహూర్తాలు ఉండగా.. ఆ తర్వాత నుంచి వివాహానికి అనువైన శుభ ఘడియాలు రాలేదు. అయితే.. మధ్యలో సుమార్ 40 నుంచి 45 రోజులు గ్యాప్ రాగా.. ఇప్పుడు మరోసారి పెండ్లి ముహూర్తాలు వచ్చేశాయి. అక్టోబర్ 05వ తారీఖు నుంచే వివాహానికి శుభ ఘడియలు మొదలయ్యాయి. దీంతో.. మరోసారి పెళ్లి భాజాలు మొగనున్నాయి. అయితే.. ఈసారి వరుసగా మూడు నెలల పాటు వరుసగా మంచి ముహూర్తాలు వస్తున్నాయి. దీంతో.. పెళ్లిళ్లు కూడా అదే స్థాయిలో ఉండనున్నట్టు పంతుళ్లు చెప్తున్నారు.

గత ఐదేళ్లలో 3 జిల్లాల్లో జరిగిన వివాహాలతో పోల్చితే అత్యధికంగా.. ఈ మూడు నెలల్లో దాదాపు 5 వేల పెళ్లిళ్లు జరగనున్నట్టు ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్‌‌లు కూడా పెరిగాయని పేర్కొంటున్నారు. అక్టోబర్ నెలలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ఉపనయనాలు, తదితర శుభకార్యాలకు చాలా అనుకూలంగా ఉందని తెలంగాణ అర్చక సంఘం కన్వీనర్‌ శ్రీరంగం గోపీ కృష్ణమాచార్యులు వివరించారు.

అయితే.. ఈ పెళ్లి ఘడియలు రేపటి నుంచే.. అంటే దసరా పర్వదినమైన అక్టోబర్ 12వ తేదీ నుంచే మొదలవుతున్నాయి. దీంతో ఒక నెల ముందు నుంచే పెళ్లిళ్ల కోసం ఫంక్షన్‌హాళ్లు.. బ్యాంకెట్‌ హాళ్లకు బుకింగ్‌లు మొదలయ్యాయి. ముఖ్యంగా.. అక్టోబరు 12వ తేదీతో పాటు..13, 16, 20, 27 కాగా.. నవంబర్‌లో 3, 7, 8, 9, 10, 13, 14, 16, 17 తేదీల్లో మంచి ముహూర్తాలుండగా.. ఇక డిసెంబర్‌లో అయితే.. 5, 6, 7, 8, 11, 12, 14, 15, 26 తేదీల్లో పెళ్లికి మంచి ఘడియలున్నట్టు పురోహితులు చెప్తున్నారు. ఇలా మూడు మాసాల్లో కలిపి సుమారు 25 రోజుల పాటు మంచి ముహూర్తాలు ఉన్నట్టు పంతుళ్లు చెప్తున్నారు.

Also Read:‘ప్రవాసీ ప్రజావాణి’ ..మార్గదర్శకాలు

పెద్దఎత్తున పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉండటంతో.. భాజా భజంత్రీలు, బ్యాండ్, డీజేతో పాటు డెకరేషన్, కేటరింగ్‌ వారికి తీరిక లేకుండా ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. దసరాతో మొదలయ్యే శుభకార్యాలు.. కొత్త ఏడాది వరకు వరుసగా జరుగనున్న నేపథ్యంలో అటు బట్టలు దుకాణాలు, బంగారం దుకాణాలు కస్టమర్లతో కళకళలాడనున్నాయి. ఒకటేమిటీ.. కిరాణా దుకాణాల నుంచి మొదలు వాహనాలు కిరాయిల వరకు మార్కెట్‌లో అందరికీ మాంచి గిరాకీ ఉండనుంది.

- Advertisement -