హీరోయిన్ త్రిష వయసు 40 సంవత్సరాలు. పెళ్లి వయసు దాటి పదిహేను ఏళ్ళు అవుతుంది. మధ్యలో ఎఫైర్లు నడిపినా.. వాటిని పెళ్లి దాకా తీసుకు వెళ్లలేకపోయింది త్రిష. కానీ, త్రిష పెళ్లి వార్తలు మాత్రం తరుచూ వైరల్ అవుతూనే ఉంటాయి. ఆ మాటకొస్తే.. తెలుగు – తమిళ ఇండస్ట్రీస్ లో త్రిష పెళ్లి గురించి వచ్చినన్ని వార్తలు బహుశా మరే హీరోయిన్ పై వచ్చివుండవు. త్రిష కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఆమె పెళ్లి వార్తలు వస్తూనే వున్నాయి. ఓ దశలో త్రిష కూడా తన పెళ్లి వార్తల పై వివరణలు ఇస్తూ అందరికీ సమాధానం చెప్పి చెప్పి విసిగిపోయింది.
ఈ పెళ్ళి గోల భరించలేకే త్రిష కొన్నాళ్ళు మీడియాకి కూడా దూరమైపోయింది. త్రిష చివరిగా పొన్నియన్ సెల్వన్: 2 ప్రమోషన్స్ లో మీడియా ముందుకు వచ్చింది. తర్వాత మళ్ళీ కనిపించలేదు. ఇప్పుడు ఓ తమిళ యాడ్ ప్రమోషన్స్ లో ఆమె మళ్ళీ మీడియాకి కనిపించింది. ఈ సందర్భంగా తన పర్సనల్ విశేషాలు పంచుకుంది త్రిష. మంచి పాత్రలు మాత్రమే చేయాలని తాను నిర్ణయించుకున్నట్లు త్రిష చెప్పుకొచ్చింది. ఇక పొన్నియన్ సెల్వన్ సినిమాలో తన లుక్స్ పై అందరూ పొగడ్తల వర్షం కురిపించారని.. అది తన అదృష్టం అని త్రిష చెప్పుకొచ్చింది.
పనిలో పనిగా మీడియా త్రిష పెళ్లి ప్రస్తావన తెచ్చింది. తన మనసుకు నచ్చే వ్యక్తి కోసం తాను ఎదురుచూస్తున్నాను అని, తాను పెళ్లికి నేను వ్యతిరేకం కాదు అని, సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేసుకుంటాను అని, పైగా ఆ సమయం త్వరలోనే వస్తోందని తాను ఆశ పడుతున్నాను అని త్రిష కామెంట్స్ చేసింది. మరి త్రిష మాటలను బట్టి పెళ్లి కోసం ముమ్మరంగా కసరత్తులు చేస్తున్నట్లు ఉంది.
Also Read:ఆ దర్శకుడికి ఇదే చివరి అవకాశం