Marriages:పెళ్లిళ్ల సందడి షురూ!

2
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల శుభసందడి ప్రారంభంకానుంది. ఈ నెల 17వ తేదీతో శుక్ర మౌఢ్యమి ముగియనున్న నేపథ్యంలో, 19వ తేదీ నుంచి వివాహ శుభ ముహూర్తాలు తిరిగి మొదలవుతాయని పండితులు వెల్లడించారు. దీంతో పెళ్లిళ్లకు ఎదురుచూస్తున్న కుటుంబాల్లో ఆనంద వాతావరణం నెలకొంది. ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు అనేక శుభదినాలు అందుబాటులో ఉన్నాయని వారు తెలిపారు. ముఖ్యంగా వేసవి కాలం మరియు శీతాకాలంలో అధిక సంఖ్యలో ముహూర్తాలు ఉండటంతో ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్ సేవలు, అలంకరణ సంస్థలు, ఫోటోగ్రఫీ బృందాలు ముందస్తు బుకింగ్‌లతో బిజీగా మారే అవకాశం ఉంది.

ముహూర్త తేదీలు:

ఫిబ్రవరి నెలలో 19, 20, 21, 24, 25, 26 తేదీలు శుభప్రదంగా భావిస్తున్నారు.
మార్చిలో 1, 3, 4, 7, 8, 9, 11, 12 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి.
ఏప్రిల్‌లో 15, 20, 21, 25, 26, 27, 28, 29 తేదీలు అనుకూలంగా ఉన్నాయి.
మే నెలలో 1, 3, 5, 6, 7, 8, 13, 14 తేదీలు శ్రేయస్కరంగా సూచించారు.
జూన్‌లో 21 నుంచి 27 వరకు వరుసగా అనేక ముహూర్తాలు ఉండగా, 29న కూడా శుభదినం ఉంది.
జులైలో 1, 6, 7, 11 తేదీలు అనుకూలంగా ఉన్నాయి.
నవంబర్‌లో 21, 24, 25, 26 తేదీలు, డిసెంబర్‌లో 2, 3, 4, 5, 6, 11, 12 తేదీలు వివాహాలకు అనువైనవిగా పేర్కొన్నారు.

Also Read:మంత్రి పదవి ఇవ్వకపోతే సీఎం అవుతా!

ఈ శుభతేదీలతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ ఉత్సాహంగా కొనసాగనుంది. కుటుంబాలు ముందస్తు ఏర్పాట్లతో వివాహ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి.

- Advertisement -