తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం ఏపీ పునర్విభజన చట్టంలోని ఏ ఒక్క అంశంను కూడా అమలు చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నేను చెప్పింది తప్పని రుజువు చేస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. రాజన్న సిరిసిల్ల పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు.
కొత్తగా ఏర్పడిన తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మొండి చెయ్యి చూపిందన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, కొత్త విద్యా సంస్థలు ఇస్తామమన్నారు. తెలంగాణలో పారిశ్రామిక కారిడర్‌లకు రాయితీలు ఇస్తామని వెనుకడుగు వేశారని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా చట్టంలో పొందు పరిచిన ఆంశాలన్ని అమలు చేయాలన్నారు.
ఈ యేడాది బడ్జెట్ కేంద్రంలోని మోదీకి చివరి బడ్జెట్ అని అన్నారు. ఎందుకంటే నేను శాపం పెడతలేను. ఈ ప్రభుత్వం 2024లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడుతుందని జోస్యం చెప్పారు. కేంద్రానికి నిబద్ధత ఉంటే.. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోవాలని సూచించారు. బీజేపీ 9 ఏండ్లలో తెలంగాణకు నయా పైసా పని చేయలేదు. తెలంగాణ సొమ్మును కేంద్రం వాడుకున్నదన్నారు.
3 లక్షల 68 వేల కోట్ల రూపాయాలను కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణ ప్రజలు కట్టారు. కేంద్రం తిరిగి రాజ్యాంగ బద్ధంగా, ఫైనాన్ష్ కమిషన్ సిఫారసు ఆధారంగా ఇవ్వాల్సిన 41 శాతం నిధులను, అంటే లక్షా 68 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. తెలంగాణ ప్రజల సొమ్ము, రక్తం, చెమటను ఇతర ప్రాంతాల్లో వాడుకున్నారు. కానీ తెంలగాణకు వీసమెత్తు పని కూడా చేయలేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ నుంచి సిద్దిపేట, సిరిసిల్ల మీదుగా మనోహరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే రైల్వే లైనును పూర్తి చేయలేదు. ఇంకా దారుణం ఏంటంటే.. 8 ఏండ్లలో తెలంగాణ రాష్ట్రంలో వేసిన రైల్వే లైన్ల పొడవు కేవలం 100 కి.మీ. కంటే తక్కువ. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టలేదు అని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ సారైన తెలంగాణకు రైల్వేలో కేటాయింపులు పెంచాలని సూచించారు. బీజేపీ ఎంపీలు ఇప్పటికైనా కేంద్రాన్ని నిలదీసి తెలంగాణకు రావాల్సిన నిధులు వచ్చేలా చూడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి…
రాహుల్ నిర్వాకం..ఫ్లాగ్ కోడ్ ఉల్లంఘన
ఆజన్మాంతం వారిద్దరికి రుణపడ్డాను…
ఫిబ్రవరి 3న జాయింట్ సెషన్…