యదార్థ సంఘటనలతో… ‘మర్లపులి’

272
Marlapuli Audio release
- Advertisement -

సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బోన్ క్రాఫ్ట్ క్రియేషన్స్ పతాకంపై డి నరసింహ సమర్పించిన చిత్రం ‘మర్లపులి’. వరుణ్ సందేశ్ ప్రత్యేకపాత్రలో, అర్చన ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి దర్శకుడు డి రామకృష్ణ. నిర్మాతలు బి సుధాకర్ రెడ్డి, బి భవాని శంకర్, ఖమ్మం శ్రీనివాస్. వీరందరి కాంబినేషన్ లో వస్తున్న ఈ మర్లపులి చిత్రం ఈనెల 23న గ్రాండ్ రిలీజ్ కు సిద్దమయ్యింది.. ఈ చిత్ర గీతాలను హీరోయిన్ భాను చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన బి. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. 1983 సంవత్సరంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ఇది. ఇందులో అందరూ పెద్ద నటీనటులే ఉన్నారు. డైరెక్టర్ రామకృష్ణ చాలా బాగా డైరెక్ట్ చేశారు. సినిమా కథ కూడా చాలా బాగుంటుంది. అందరికి నచ్చేలా దర్శకుడు తెరకెక్కించారు. సస్పెన్సు థ్రిల్లర్ జోనర్. ఈ చిత్రానికి నేనే మ్యూజిక్ అందించాను. పాటలు అందరి ఆదరణ పొందుతాయని ఆశిస్తున్నాను.. సినిమా అయితే తప్పకుండా ఘనవిజయం పొందుతుందని నమ్మకంగా ఉన్నాము.. అన్నారు.

డైరెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ.. 13 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసాము.. తక్కువ సమయం అయినప్పటికీ మంచి క్వాలిటీ తో తెరకెక్కించాము. నరసాపూర్ ఫారెస్ట్ లో షూటింగ్ చేశాము. నటీనటులందరూ ఎంతో సహకరించారు.. నిర్మాత డి సుధాకర్ రెడ్డి గారు అద్భుతమైన మ్యూజిక్ తో పాటు చిత్రానికి కావలసిన అన్నీ సౌకర్యాలను అమర్చారు. మంచి కథ.. యథార్థ గాధ కనుక తప్పకుండా విజయం సాదిస్తుందని నమ్ముతున్నా అన్నారు.

Marlapuli  Audio release

హీరోయిన్ భాను మాట్లాడుతూ.. నాచేత గీతావిష్కరణ జరిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో వరుణ్ సందేశ్ పక్కన నటించాను. అంతేకాదు లీడ్ రోల్ కూడా.. సినిమా చాలా బాగొచ్చింది.. అందరూ కస్టపడి పని చేశారు.. తప్పకుండా విజయం సాదిస్తుందని ఆశిస్తున్నా అన్నారు. చాలా చిన్న సినిమా అయినప్పటికీ పక్కా ప్లానింగ్ తో సినిమా చేశారని అర్థమవుతోంది.. ఒరిజినల్ గా జరిగిన స్టోరీ కనుకే కథలో బలం ఉంటుంది.. వినూత్నమైన సినిమాలను ప్రోత్సహించే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే చిత్రం ఈ మర్లపులి. అందరికీ మంచి పేరును తీసువచ్చే చిత్రం అవుతుందని భావిస్తున్నా అన్నారు అతిథి కుబుసం దర్శకుడు శ్రీనాథ్. ఈ కార్యక్రమంలో నటులు దేవరాజ్, శిరీష, ప్రశాంత్ కార్తీక్, అనిత ఆలపాటి, విజయ్, శివ కార్తీక్, రమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వరుణ్ సందేశ్, అర్చన, పోసాని, తాగుబోతు రమేష్, చమ్మక్ చంద్ర, తదితర ముఖ్య తారాగణంతో వస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎం. మురళీకృష్ణ, సంగీతం: బి ఎస్ రెడ్డి, నిర్మాతలు: బీరం సుధాకర్ రెడ్డి, బి భవాని శంకర్, ఖమ్మం శ్రీను, డైరెక్టర్: రామకృష్ణ.

- Advertisement -