ఫేస్‌బుక్ లో కోట్లాది యూజర్ల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అవడంతో చిక్కుల్లో పడ్డారు ఆసంస్థ సీఈవో జుకర్ బర్గ్. పేస్ బుక్ పై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంబ్రిడ్జ్ అనలిటికా కుంభకోణంపై వివరణ ఇచ్చారు జుకర్. తప్పు జరిగిపోయిందని, దాన్ని ఒప్పుకుంటున్నానని అన్నారు. ఇలాంటి ఘటనలు, తప్పులు మరోసారి జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు.
ఫేస్ బుక్ వ్యక్తిగత సమాచారాన్ని కొన్ని యాప్ లు దుర్వినియోగం చేస్తున్నాయని, వీటి విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ తరహా యాప్ లను ఇప్పటికే నిషేధించామని వెల్లడించారు. ఫేస్ బుక్ తీసుకోబోతున్న న్యాయపరమైన చర్యలపైనా వివరణ ఇచ్చారు.
అమెరికా అధ్యక్ష ఎన్నిలకల్లో కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థకు దాదాపు 5కోట్ల మంది సమాచారం చిక్కిందని వార్తలొచ్చాయి. ఈ లీక్‌లపై పూర్త విచారణ జరిపించాల్సిందేనంటూ..అమెరికా సహా బ్రిటన్ ఈయూ దేశాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ లీక్‌ల పై విచారణ ఇవ్వాలంటూ..జూకర్‌బర్క్ కు బ్రిటన్ పార్లమెంటరీ కమిటీ నోటీసులు పంపింది. ఈ నేపథ్యంలో జుకర్ స్పందించారు.