స్త్రీలకు ఉపయోగ పడే ‘మర్జరీ ఆసనం’!

39
- Advertisement -

యోగా ఆసనాలలో ఈరోజు మర్జరీ ఆసనం గురించి తెలుసుకుందాం. దీనినే మర్జలాసనం అని కూడా అంటారు. ఈ ఆసనం చూడడానికి పిల్లి ఆకారం వలె ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఈ ఆసనం ఊర్థ్వ ముఖ మర్జరీ ఆసనం మరియు అధోముఖ మర్జరీ ఆసనం అని రెండు విధాలుగా ఉంటుంది. ఈ ఆసనం వేయడం ఎంతో సులభం. అంతే కాకుండా ఈ ఆసనం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనలు కూడా అధికం. కాబట్టి మర్జరీ ఆసనం వేయు విధానంతో పాటు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా తెలుసుకుందాం

మర్జరీ ఆసనం వేయు విధానం
ముందుగా నేలపై లేదా యోగా షీట్ పై వజ్రాసనంలో కూర్చోవాలి. ఆ తరువాత పిరుదులను పైకెత్తి మోకళ్లపై కూర్చోవాలి. ఆ తరువాత కాళ్ళను కొద్దిగా ఎడం చేసి అరచేతులను నేలపై ఫోటోలో చూపిన విధంగా ఉంచవలెను. మొకళ్ళతో సరిసమానంగా చేతుల మద్య దూరం ఉండాలి. ఆ తరువాత తలను పైకెత్తి నెమ్మదిగా శ్వాస పిలుస్తూ వెన్నెముకను లోపలివైపుకు అనుస్తూ వీపును పల్లం చేయవలెను. రెండవ దశలో వీపును విల్లువలె పైకి లేపి తలను క్రిందకు వంచవలెను. వెన్నెముక ఉబ్బెత్తుగా ఉండేటట్లుగా చూసుకుంటే ఇంకా మంచిది. ఆ తరువాత ఎడమ కాలిమోకాలును ఛాతీకి అధిమినట్లు చేసి ముక్కు మోకాలికి తాగేటట్లుగా చేయాలి. ఆ తరువాత కుడి కాలితో కూడా ఇదే విధంగా చేయవలెను. ఇలా మర్జరీ ఆసనం చేసే సమయంలో శ్వాస క్రియను నెమ్మదిగా జరిగించవలెను.

ప్రయోజనలు

ఈ ఆసనం వల్ల వెన్నెముకకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.. తద్వారా వెన్నెముక యొక్క నరాలకు పటుత్వం పెరుగుతుంది. అంతే కాకుండా కటి ప్రదేశంలోని నరాలపై ఒత్తిడి తగ్గించి కాళ్ళ యొక్క నరాలను వదులు చేస్తుంది. ముఖ్యంగా స్త్రీలలో ప్రత్యుత్పత్తి అవయవాల ఆరోగ్యాన్ని సమతుల్య పరుస్తుంది. స్త్రీ లు ప్రసవం తరువాత గాని లేదా ఎక్కువ మంది పిల్లలను ప్రసవించిన వారు ప్రతిరోజూ ఈ ఆసనం వేయడం ఎంతో మేలని యోగా నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ ఆసనం ప్రతిరోజూ వేయడం వల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరగడంతో పాటు ఉదర కండరాల పటుత్వం పెరుగుతుంది. అంతేకాకుండా జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.

Also Read:సిద్దార్థ్ 40…అనౌన్స్‌మెంట్

- Advertisement -