గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి..

197
Mareddy Srinivas Reddy
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తన జన్మదిన సందర్భంగా, నిజాంపేటలో తన నివాసం వద్ద మొక్కలు నాటారు. ముఖ్య మంత్రి కేసీయార్ హరిత తెలంగాణ ఆశయ సాధనలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ సృష్ఠికర్త, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ మహా కార్యంలో పాల్గొన్నానని ఈ సందర్భంగా మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ఇలాంటి హరిత ఉద్యమం ద్వారా యావత్ తెలంగాణ, యావత్ భారత దేశం హరిత మయంగా మారాలని, సంతోష్ కుమార్ కన్న కలలు సాకారం కావాలని ఆకాంక్షించారు.

- Advertisement -