తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాలలో నటించిన ట్యాలెంటెడ్ మలయాళ యాక్టర్ ఉన్ని ముకుందన్ తన లేటెస్ట్ చిత్రం ‘మార్కో’తో బ్లాక్ బస్టర్ సాధించాడు. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ ముహమ్మద్ నిర్మించారు, మార్కో డిసెంబర్ 20న మలయాళ థియేటర్‌లలోకి వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం. విడుదలైన తర్వాత ప్రేక్షకులు విమర్శకుల ప్రశంసలను అందుకుని ఘన విజయం సాధించింది. ముఖ్యంగా ఉన్ని ముకుందన్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ప్రత్యేక ప్రశంసలు వచ్చాయి. చిత్రం గ్రిప్పింగ్ యాక్షన్ సన్నివేశాలు, అద్భుతమైన సినిమాటోగ్రఫీ, పవర్ ఫుల్ మ్యూజిక్, మొత్తం టెక్నికల్ కు ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ ను జనవరి 1న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది ఎన్వీఆర్ సినిమా.
తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ మార్కో ఇంటెన్స్ బ్లడ్ షెడ్ వరల్డ్ లోకి ఒక గ్లింప్స్ గా హీరో యాక్షన్-ప్యాక్డ్ జర్నీని హైలైట్ చేస్తుంది. అది అతని గతాన్ని మనుగడ కోసం హై స్టేక్ బాటిల్ లో అతను ఎదుర్కోవాల్సిన అనేక మంది శత్రువులను కూడా ప్రజెంట్ చేస్తోంది.
ఉన్ని ముకుందన్ టైటిల్ రోల్‌లో అదరగొట్టారు, ముఖ్యంగా సినిమా హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలలో ఆకట్టుకున్నాడు. అతని పాత్ర సినిమాకు మెయిన్ స్ట్రెంత్ లో ఒకటి. ఈ చిత్రంలో సిద్దిక్, జగదీష్, అభిమన్యు ఎస్ తిలకన్, కబీర్ దుహన్ సింగ్, అన్సన్ పాల్, యుక్తి తరేజా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read:TGSRTC: సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
చంద్రు సెల్వరాజ్ స్టైలిష్ సినిమాటోగ్రఫీ చిత్రాన్ని విజువల్ ఫీస్ట్ గా మార్చింది. KGF, సలార్ ఫేం రవి బస్రూర్ ఇంటెన్స్ స్కోర్‌తో యాక్షన్ ని ఎలివేట్ చేశాడు. షమీర్ మహమ్మద్ ఎడిటింగ్ నెరేటివ్ వేగంగా సాగేలా చేసింది.ట్రైలర్ తెలుగు ప్రేక్షకులలో సంచలనాన్ని సృష్టించింది, సినిమా గ్రిప్పింగ్ కంటెంట్ విశేషంగా ఆకట్టుకుని హైలీ యాంటిసిపేటెడ్ రిలీజ్ గా ఆడియన్స్ ముందుకు వస్తోంది.