- Advertisement -
తెలంగాణ కేబినెట్ ఇవాళ భేటీ కానుంది. సోమవారం నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర బడ్జెట్ 2022-23కి అమోదం తెలపనుంది. ఈ సారి గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది.
సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్‌లో మంత్రివర్గం సమావేశం కానుంది. మార్చి 7 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా.. అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2022-23ని సభలో ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి హరీష్‌రావు. ఇక అసెంబ్లీ సమావేవాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయానికి రానున్నారు.
- Advertisement -