టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు భేష్ అని కొనియాడారు మాజీ మావోయిస్టు పురుషోత్తం. ఆసరా,రైతుబంధు,కల్యాణలక్ష్మీ పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. హైదరాబాద్‌లో సీపీ అంజనీకుమార్ ఎదుట పురుషోత్తం,ఆయన భార్య వినోదిని లొంగిపోయారు.
ఈ సందర్భంగా మాట్లాడిన అనారోగ్యం కారణంగానే లొంగిపోయామని చెప్పారు. మావోయిస్టు పార్టీ నాయకత్వం సరిగ్గా లేదని గత రెండేళ్లుగా పార్టీలో మాకు స్ధానం లేదన్నారు. సెంట్రల్ కమిటీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు.
గత పదేళ్లుగా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నామని చెప్పారు. అగ్రనేత గణపతితో కలిసి చాలా ఏండ్లు పనిచేశామని చెప్పారు.
పురుషోత్తంపై రూ. 8 లక్షల రివార్డు ఉందన్నారు సీపీ. 1974లో పురుషోత్తం బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్, 1987 ఎంఏ చేశారని… సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆయన తల్లిదండ్రుల మృతి అనంతరం పార్టీలో చేరారని తెలిపారు. 1982లో నోదినిని వివాహం చేసుకున్నారని వినోదిని కూడా అడ్డగుట్ట ఏరియాలో టీచర్ గా పనిచేసిందని తెలిపారు.