మావోయిస్ట్ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు రావుల శ్రీనివాస్ అలీయాస్ రామన్న మృతిని మావోయిస్టు పార్టీ ధృవీకరించింది. అయితే ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు వస్తున్న వార్తలను ఖండించింది. టైఫాయిడ్ జ్వరం వల్ల రామన్న మృతి చెందినట్టు ఆ పార్టీ ప్రతినిధి ఒకరు తెలిపారు. రామన్నకు ఘనంగా అంతిమ వీడ్కోలు నిర్వహించిన మానోయిస్టులు.. సుక్మా – బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో దహన సంస్కారం పూర్తి చేశారు.
ఈ కార్యక్రమానికి సరిహద్దు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. 15 రోజుల క్రితం రామన్న మృతి చెందారు. తొలుత నాలుగైదు రోజుల పాటు ఆయన మరణ వార్తను గోప్యంగా ఉంచిన మావోయిస్టులు. ఆ తర్వాత రామన్న చనిపోయినట్లు ధృవీకరించారు. ఒకటి రెండు ఫోటోలను మీడియా కు విడుదల చేశారు. ఇపుడు రామన్న అంతిమ యాత్ర పూర్తి పోటోలను విడుదల చేయ్యడంతో పాటు మృతికి కారణాలను కూడా ప్రకటించారు.
కాగా రామన్నపై 40 లక్షల రివార్డు ఉన్నది. చిన్నతనంలోనే ఇల్లు విడిచి వెళ్లి. మావోయిస్టుల్లో చేరిన రామన్న అలియాస్ రావుల శ్రీనివాస్ సొంతూరు బెక్కల్ గ్రామం, మద్దూర్ మండలం సిద్దిపేట్ జిల్లా. ఆయన సతీమణి, కుమారుడు కూడా విప్లవ దళాల్లోనే ఉన్నారు. రామన్న సోదురులు కూడా మావోయిస్టుల్లో పని చేసి చనిపోయారు.