ఎన్‌కౌంటర్..మావోయిస్టు చలపతి మృతి

2
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ బోర్డర్లో భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టులతో సహా ఒడిశా మావోయిస్టు పార్టీ చీఫ్ చలపతి మృతి చెందారు. ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని గరియాబంద్ జిల్లా కులారి ఘాట్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులలో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.

అయితే, ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ ఒడిశా స్టేట్ చీఫ్ చలపతి మృతి చెందినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు ఈ కూబింగ్ ఆపరేషన్లో మొత్తం 14 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలిపాయి భద్రతా బలగాలు.

అయితే, మృతుల్లో పలువురు ప్రముఖ మావోయిస్టు నేతలు కూడా ఉన్నట్లుగా సమాచారం. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read:పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ టూర్

- Advertisement -