యంగ్ హీరో శివ కందుకూరి నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ‘మను చరిత్ర`. మేఘా ఆకాష్, ప్రియ వడ్లమాని హీరోయిన్లగా నటిస్తోన్న ఈ చిత్రంతో భరత్ పెదగాని దర్శకునిగా పరిచయమవుతున్నారు. కాజల్ అగర్వాల్ సమర్పణలో ప్రొద్దుటూరు టాకీస్ బ్యానర్‌పై నరాల శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్నారు. వరంగల్ నేపథ్యంలో ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి హమేషా..హమేషా లిరికల్ వీడియోసాంగ్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
కనబడకనే తెగ తిరుగుతు నను వెతికిన తుమ్ సే మేరా.. అంటూ సాగే ఈ పాటకు కృష్ణకాంత్ (కె.కె) సాహిత్యం అందించారు. రమ్య బెహ్రా అందంగా ఆలపించారు. గోపీ సుందర్ ఫ్రెష్ ట్యూన్స్ శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
తారాగణం:
శివ కందుకూరి, మేఘా ఆకాష్, ప్రియ వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్, సుహాస్, డాలి ధనంజయ్, శ్రీకాంత్, అయ్యంగార్, మధునందన్, రఘు, దేవీప్రసాద్, ప్రమోదిని, సంజయ్ స్వరూప్, హర్షిత, గరిమ, లజ్జ శివ, కరణ్, గడ్డం శివ, ప్రదీప్.
సాంకేతిక బృందం:
రచన-దర్శకత్వం: భరత్ పెదగాని
నిర్మాత: నరాల శ్రీనివాసరెడ్డి
సమర్పణ: కాజల్ అగర్వాల్
బ్యానర్: ప్రొద్దుటూరు టాకీస్
మ్యూజిక్: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
ఆర్ట్: ఉపేందర్ రెడ్డి
సాహిత్యం: సిరాశ్రీ, కేకే
కొరియోగ్రఫీ: చంద్రకిరణ్
యాక్షన్: ‘రియల్’ సతీష్, నందు
పీఆర్వో: వంశీ-శేఖర్.