Olympics: మను భాకర్ హ్యాట్రిక్ మిస్‌

10
- Advertisement -

పారిస్ ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ మెడల్ కొట్టే అవకాశాన్ని మిస్ చేసుకుంది షూటర్ మనూ బాకర్‌. 25మీ పిస్తోల్ ఈవెంట్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. మ‌నూ, హంగేరియ‌న్ షూట‌ర్ మ‌ధ్య ఎలిమినేష‌న్ రౌండ్ జ‌రుగగా హ్యాట్రిక్‌తో చ‌రిత్ర సృష్టించే అవ‌కాశాన్ని మ‌నూ తృటిలో మిస్సైంది.

33 పాయింట్ల‌తో కొరియా క్రీడాకారిణి జిన్ యాంగ్ తొలి స్థానంలో ఉండ‌గా, ఫ్రాన్స్ షూట‌ర్ కామిల్లీ జెడ్‌జివిస్కీ రెండ‌వ స్థానంలో, వెరోనికా మూడ‌వ స్థానంలో నిలిచారు. నాలుగో స్థానంలో నిలిచింది మను భాకర్. పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీట‌ర్ల ఎయిర్ పిస్తోల్‌, మిక్స్‌డ్ 10 మీట‌ర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్ల‌లో మ‌నూ భాక‌ర్ కాంస్య ప‌త‌కాలు సాధించిన విష‌యం తెలిసిందే.

Also Read:US Elections: కమలాతో డిబేట్‌కు ట్రంప్ ఓకే

- Advertisement -