2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఏపీలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంచు మనోజ్. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీల మాటేంటని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు మనోజ్.
ఇన్ని రోజులు మీరు చేసిన యుద్ధంలో మేమూ మీకు మద్దతు పలికాం. మీరు.. ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని ఇంత కాలం వేచి చూశాం. ప్రత్యేక హోదా కాదు కదా.. కనీసం కృతజ్ఞత కూడా మీ నుంచి రాలేదని మండిపడ్డారు. మా డిమాండ్‌ను గౌరవించి, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వండి.. లేకపోతే ఏ సన్నిధిలోనైతే హోదా ప్రమాణం చేశారో.. ఆ లార్డ్ బాలాజీ ఆగ్రహానికి గురికాకతప్పదు అని హెచ్చరించారు.
PM @narendramodi, We stood with u in ur fight,supported u when u needed us,waited 4 u to fulfill ur promise. Neither gratitude nor #SpecialStatus came frm u. It‘s time,u respect our just demand & grant #APSpecialStatus to our gr8 #AP or face wrath of Lord Balaji wr u promised! pic.twitter.com/5uCT8WSzI1
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) February 1, 2019