manoj:మనోజ్‌…మిస్టర్ బ్రహ్మ ఏంటీ ఈ డ్రామా?

15
- Advertisement -

మేఘాంశ్ శ్రీహరి, రియా సచ్‌దేవ ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు జి. భవానీ శంకర్ దర్శకత్వంలో A2 పిక్చర్స్ బ్యానర్ పై సంధ్యా రాణి, స్వరూప రాణి నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా ?’

ఈ రోజు ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. హీరో మంచు మనోజ్ క్లాప్ కొట్టగా, చోటా కె నాయుడు కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు బాబీ కొల్లి గౌరవ దర్శకత్వం వహించారు. మంచు మనోజ్, బాబీ కొల్లి , చోటా కె నాయుడు టైటిల్ పోస్టర్ లాంచ్ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిత్ర యూనిట్ కు శుభాశీస్సులు అందించారు.

ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. సి . రామ్ ప్రసాద్ కెమరామెన్ గా పని చేస్తుండగా.. స్టార్ కంపోజర్ గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఎంఆర్ వర్మ ఎడిటర్ కాగ, రఘు కులకర్ణి ఆర్ట్ డైరెక్టర్. పోసాని కృష్ణ మురళి, సునీల్, హర్ష వర్ధన్, శ్రీనివాస్ రెడ్డి, నెల్లూరు సుదర్శన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మూవీ లాంచింగ్ ఈవెంట్ లో హీరో మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ.. ప్రారంభోత్సవ వేడుకకి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన మంత్రి తలసాని కి, మనోజ్ అన్నకి, బాబీ అన్నకి, చోటా కి కృతజ్ఞతలు. దర్శకుడిని నమ్మి ఈ సినిమా చేశాను. మా నిర్మాత చాలా గొప్ప సపోర్ట్ ఇచ్చారు. గోపిసుందర్, రామ్ ప్రసాద్ లాంటి బెస్ట్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పని చేయడం ఆనందంగా వుంది. మమ్మల్ని నమ్మి ఇంత భారీగా సినిమాని నిర్మిస్తున్న నిర్మాతకు మరోసారి కృతజ్ఞతలు’’ తెలిపారు.

దర్శకుడు భవానీ శంకర్ మాట్లాడుతూ.. ఈ కథని ఎక్కడా రాజీపడకుండా గొప్పగా నిర్మిస్తున్న నిర్మాతలకు కృతజ్ఞతలు. గోపిసుందర్, రామ్ ప్రసాద్,ఎంఆర్ వర్మ లాంటి మంచి టెక్నిషియన్స్ ఇచ్చారు. వారి నమ్మకం వలనే ఇది సాధ్యపడింది. ఎ 2 పిక్చర్స్ కి ఎప్పుడూ రుణపడి వుంటాను. గోపి సుందర్ ఇచ్చిన పాటలన్నీ బ్లాక్ బస్టర్ అవుతాయ్. ఇందులో బ్రహ్మ పాత్ర సౌత్ ఇండస్ట్రీ లో ఒక టాప్ హీరో చేయబోతున్నారు. అది త్వరలోనే అనౌన్స్ చేస్తాం. ఇది సోషియో ఫాంటసీ, మైథాలజీ, లవ్, ఫుల్ ఎంటర్ టైనర్. మీ అందరి ప్రోత్సాహం కావాలి’ అని కోరారు.

గోపి సుందర్ మాట్లాడుతూ.. దర్శకుడు భవానీ చెప్పిన కథ చాలా నచ్చింది. ఇందులో ఆరు పాటలు వుంటాయి. ఇది ఫుల్ ప్యాకేజ్. సబ్జెక్ట్ చాలా కొత్తగా వుంటుంది. అందరూ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. మీ అందరి సపోర్ట్ కావాలి’’ అన్నారు.

రియా సచ్‌దేవ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ లో చేయడం చాలా ఎక్సయిటింగా వుంది. మీ అందరి సపోర్ట్ కావాలి’’ అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ.. ఎ 2 పిక్చర్స్ ద్వారా మేము నిర్మిస్తున్న మొదటి చిత్రం ‘మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా?’. దర్శకుడు భవానీ శంకర్ చెప్పిన కథ చాలా బావుంది. కథపై నమ్మకంతో ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నాం. ఈ చిత్రానికి గోపీసుందర్, రామ్ ప్రసాద్ లాంటి పెద్ద టెక్నిషియన్స్ వుండటం మా అదృష్టం. మా మొదటి ప్రయత్నాన్ని అందరూ ఆదరించాలి’’ అని కోరారు.

ఇవి కూడా చదవండి…

memufamous:మేమ్‌ ఫేమస్‌ బ్లాక్ బస్టర్ హిట్‌: మల్లారెడ్డి

keerthy:వెన్నెల ఛాలెంజింగ్ పాత్ర: కీర్తి

meter:మార్చి 29న మీటర్ ట్రైలర్ బ్లాస్ట్‌

- Advertisement -