నా పెళ్లికి నన్ను కూడా పిలవండి: మనోజ్ సెటైర్

120
manchu
- Advertisement -

తన రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై తనదైన శైలీలో స్పందించారు హీరో మంచు మనోజ్. ఆ వార్త రాసిన లింక్‌ను షేర్ చేసిన మనోజ్…నా పెళ్లికి నన్ను పిలవాలన్నారు. అంతేగాదు పెళ్లి జ‌రిగే స్థ‌లం ఎక్క‌డ‌.. ఆ బుజ్జి పిల్ల‌, తెల్ల పిల్ల ఎవ‌రు? అంతా మీ ఇష్టం రా మీ ఇష్టం.. అని క‌న్నుకొట్టి నాలుక బ‌య‌ట పెట్టే సింబ‌ల్‌ను పోస్ట్ చేశారు. మనోజ్ చేసిన పోస్టు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఒక వైపు తండ్రి స్టార్ట్ చేసిన విద్యా సంస్థ‌ల బాధ్య‌త‌ల‌ను చూసుకుంటున్న మంచు మ‌నోజ్‌.. ఏకంగా అహం బ్ర‌హ్మాస్మి అనే పాన్ ఇండియా మూవీని స్టార్ట్ చేశాడు. అది కూడా త‌న సొంత బ్యాన‌ర్‌లో. ఎంఎం ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తొలి చిత్రం ‘అహం బ్రహ్మాస్మి’ని నిర్మిస్తున్నట్టు ఇటీవల మనోజ్ ప్రకటించ‌డంతో పాటు కోపం. శాంతం, ఆనందం కనిపించేలా మూడు డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఉన్న పోస్ట‌ర్‌ను ఫ‌స్ట్‌లుక్‌గా రిలీజ్ చేశారు.

- Advertisement -