మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా మన్నె

16
- Advertisement -

మహబూబ్ నగర్ పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డిని ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇక మహబూబ్ నగర్ స్థానానికి శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి పేర్లు వినిపించిన సిట్టింగ్ ఎంపీ మన్నెనే అభ్యర్థిగా ప్రకటించారు.

ఇక ఇప్పటికే నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కరీంనగర్ – బి. వినోద్ కుమార్,పెద్దపల్లి – కొప్పుల ఈశ్వర్,ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు,మహబూబాబాద్ – మాలోత్ కవితను ప్రకటించారు కేసీఆర్.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి వెళ్లనున్నారు కేసీఆర్. ఈ మేరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో భేటీ అనంతరం బీఎస్పీ -బీఆర్ఎస్ పొత్తును అనౌన్స్ చేశారు.

Also Read:బీఎస్పీతో కలిసి పనిచేస్తాం:కేసీఆర్

- Advertisement -