ఫ్రాండ్‌ కంపెనీలతో తెలంగాణలో పెట్టుబడులా?:క్రిశాంక్

7
- Advertisement -

బీఆర్ఎస్ హయాంలో 2022-23 లో ఐటీ ఎగుమతులు ₹57,706 కోట్లుగా ఉంటే శ్రీధర్ బాబు రిలీజ్ చేసిన దాంట్లో 2023-24 చూస్తే సగాని సగం పడిపోయి ₹26,948 కోట్లుగా ఉన్నాయని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్. కాంగ్రెస్ హయాంలో ఉపాధి అవకాశాలు సగం పడిపోయాయి… పెట్టుబడులు కూడా సగం పడిపోయాయన్నారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అప్పగించే సంస్థపై లుక్ అవుట్ నోటీసులు అన్నారు.

ఫ్రాడ్ కంపెనీల పెట్టుబడుల కోసమే అమెరికాకు రేవంత్ రెడ్డి పోయారన్నారు. కేవలం నాలుగు నెలల క్రితమే ప్రారంభం అయిన వాల్ష్ కర్రా హోల్డింగ్స్ అనే కంపెనీ 839 కోట్ల రూపాయలు పెట్టుబడి ఎట్లా పెడ్తది?,ఈ కంపెనీలో భాగస్వామి అయిన ఫణి కర్ర పాత ట్రాక్ రికార్డ్ చూస్తే స్ట్రైక్ ఆఫ్ అయిన ఒక కంపెనీకి డైరెక్టర్ గా ఉన్నాడని దుయ్యబట్టారు.

పెట్టుబడులు తీసుకురావడంలో కేటీఆర్‌తో పోటీ పడాలని ఫ్రాడ్‌ కంపెనీలు, బోగస్‌ కంపెనీలు తెచ్చి ప్రచారం ఎందుకు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇలా ఎవరిని పడితే వాళ్లను కలిసి, స్ట్రైక్‌ఆఫ్‌ అయిన కంపెనీతో ఒప్పందాలు చేసుకుని వస్తే ఎవరూ ఊరుకోరని హెచ్చరించారు. దావోస్‌లో గోధి ఇండియా అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. రూ.27 లక్షల వార్షిక లాభం లేని సంస్థ ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు ఎలా పెడుతుందని యాన్వల్‌ స్టేట్‌మెంట్ తెప్పించి అడిగితే సీఎం గప్‌చుప్‌ అయ్యారని విమర్శించారు. ఫ్రాడ్‌ కంపెనీలను ఎందుకు తీసుకొస్తున్నారని…ఇది తెలంగాణకు అంత మంచిది కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరిని కలిసినా.. ఎవరితో వ్యాపారం చేసినా వారి ట్రాక్‌ రికార్డు బాగుండాలని సూచించారు.

Also Read:Paris Olympics: జావెలిన్‌ త్రో ఫైనల్స్‌లో నీరజ్ చోప్రా

- Advertisement -