చిత్రపురి సొసైటీలో రూ. 3 వేల కోట్ల భూదందా చేసిన అనుముల మహానంద రెడ్డికి, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం ఉందని ఆధారాలు ఉన్నాయి. దమ్ముంటే ఇది తప్పని రేవంత్ రెడ్డి కోర్టుకి వచ్చి నిరూపించగలడా? అని సవాల్ విసిరారు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన క్రిశాంక్..చిత్రపురి కాలనీలో 3000 కోట్ల కుంభకోణం జరిగిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఫోన్ సీజ్ చేస్తారా ?ఇదేనా ప్రజా పాలన ? ఇదేనా కాంగ్రెస్ చెప్పిన ప్రజాస్వామ్యం ?అని మండిపడ్డారు.
ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాజెక్టుల కింద నీళ్లందక, కరెంటు కోతలతో పంటలు ఎండిపోయి.. మరోవైపు అకాల వర్షాలతో, వడగండ్లతో రాష్ట్రంలో రైతన్న కష్టాలలో ఉంటే.. ఢిల్లీ నాయకులకు గులాం గిరీ చేయడంలో కాంగ్రెస్ నాయకులు బిజీగా ఉన్నారన్నారు. రేవంత్ ప్రభుత్వం అవినీతిపై ప్రశ్నిస్తే కేసులు వేస్తారా ?జ్యుడీషియల్ వారెంట్ లేకుండా ఫోన్ ఎలా జప్తు చేస్తారు ? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
దమ్ముంటే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయండి ..అంతేకానీ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు వేస్తారా ? అన్నారు బీఆర్ఎస్ నేత వై. సతీష్ రెడ్డి.ఇదేనా ప్రజా పాలన,ప్రజల తరపున పోరాడితే.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు, దౌర్జన్యాలు, దాడులు చేస్తారా⁉️ ఆలోచించాలన్నారు.
Also Read:ఉన్మాదం సృష్టిస్తోన్న బీజేపీ:షర్మిల