Krishank:కాంగ్రెస్,బీజేపీ అబద్దాలకు తలవంచం

12
- Advertisement -

కాంగ్రెస్, బీజేపీ అబద్దాలకు తలవంచే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు బీఆర్ఎస్ నేత మన్నే క్రిశాంక్. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కయిందని, బీజేపీ గెలుపు కోసం కేసీఆర్ కష్టపడ్డారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు క్రిశాంక్.

మ‌హ‌బూబాబాద్‌లో బీఆర్ఎస్‌కు 2.61 ల‌క్ష‌ల ఓట్లు, బీజేపీకి 1.08 ల‌క్ష‌ల ఓట్లు పోల‌య్యాయి. ఇక్క‌డ బీజేపీతో చేతులు క‌లిపామా..? వ‌రంగ‌ల్‌లో బీజేపీపై కాంగ్రెస్ అభ్య‌ర్థి 2.20 ల‌క్ష‌ల మోజార్టీతో గెలిచారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్‌కు 2.32 ల‌క్ష‌ల ఓట్లు పోల‌య్యాయి. మ‌రి మేం బీజేపీతో చేతులు క‌లిపితే కాంగ్రెస్ ఎలా గెలిచింది..? చెప్పాలన్నారు.

భువ‌న‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీపై కాంగ్రెస్ అభ్య‌ర్థి 2.20 ల‌క్ష‌ల ఓట్ల మెజార్టీతో గెలిచారు. బీఆర్ఎస్‌కు 2.54 ల‌క్ష‌ల ఓట్లు వ‌చ్చాయి. మేం బీజేపీతో చేతులు క‌లిపితే కాంగ్రెస్ ఎలా గెలిచేది..? నాగ‌ర్‌క‌ర్నూల్ నియోజ‌క‌వ‌ర్గంలో కేవ‌లం 94 వేల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ బీజేపీపై గెలుపొందింది. బీఆర్ఎస్‌కు 3.19 ల‌క్ష‌ల ఓట్లు వ‌చ్చాయి.. బీజేపీ కంటే కేవ‌లం 40 వేల ఓట్లు త‌క్కువ‌. నాగ‌ర్‌క‌ర్నూల్‌లో మేం గ‌ట్టి పోటీ ఇవ్వ‌కుంటే కాంగ్రెస్ అభ్య‌ర్థి ఓడిపోయేవారు క‌దా..? అని రేవంత్‌ను క్రిశాంక్ ప్ర‌శ్నించారు.

Also Read:ధర్మం దే విజయం..వీరమల్లు స్పెషల్ పోస్టర్

- Advertisement -