భర్తీ అవుతున్న కాంట్రాక్టు ఉద్యోగాలకు సంబంధించిన వివరాలన్నీ ముందుగా అలంపూర్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వద్దకే వెళ్లాలంటూ ఆదేశాలు ఉన్నాయని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ ఆరోపించారు. ఆ ఉద్యోగాల లిస్ట్‌పై సంపత్ కుమార్ టిక్ వేస్తేనే అది బయటకు వెళ్లేదని, ఆ టిక్ పడాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని ఆయన అన్నారు.
ఒకవేళ సంబంధిత అధికారి టిక్ వేయడానికి లిస్ట్ ఇవ్వకపోతే, వెంటనే ఆ అధికారిని ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారని మన్నె క్రిశాంక్ ఆరోపించారు. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ బూతులు తిడుతూ, బెదిరింపులకు పాల్పడిన ఆడియోలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఆయనపై సిట్ విచారణకు ఆదేశిస్తే, ఆ ఆడియోలను పోలీసు అధికారులకు అందజేస్తామని స్పష్టం చేశారు.
మీడియా చానళ్లపై సిట్ విచారణలు చేస్తున్న ప్రభుత్వం, అలంపూర్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ దందాలపై ఎందుకు విచారణ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంట్రాక్టు పనులు జరగాలంటే తనకు రూ.8 కోట్ల కమిషన్ ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ, అలాంటి వ్యక్తిపై సిట్ విచారణ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు.
Also Read:‘కనుమ’..ఎందుకు జరుపుకుంటారు?

