ఓట్ల కోసం వెబ్‌సిరీస్‌గా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని చెప్పారు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన క్రిశాంక్…కేసీఆర్‌ని తిట్టేందుకు కాంగ్రెస్ పార్టీ రూ.100 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
వరంగల్ డిక్లరేషన్‌లో ప్రకటించిన రూ. 500 బోనస్, రైతుకు రూ. 15 వేల ఆర్థికసాయం హామీలు ఎటు వెళ్లాయో చెప్పాలన్నారు. రైతు ఆత్మహత్యలు, ఎండిన పంటల అంశాన్ని, రైతుల డిమాండ్లను పక్కదారి పట్టించేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఫోన్లు ట్యాపింగ్ జరిగాయా..? లేదా..? అన్నది ట్రాయ్‌ని అడగండి. మరి ఈ కేసులో ట్రాయ్, టెలికాం ప్రొవైడర్లను ఎందుకు పెట్టలేదో చెప్పాలన్నారు.
సోనియా యూపీఏ చైర్‌పర్సన్‌గా, రాహుల్ ఎంపీగా ఉన్నప్పుడు, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోన్ ట్యాపింగ్‌పై ఒక స్టేట్‌మెంట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ అవసరమని మన్మోహనే చెప్పారు. మరి మన్మోహన్‌ను బద్నాం చేశారా..? మరి మేం మాట్లాడితే రేవంత్ రెడ్డి తమపై కేసులు పెట్టిస్తున్నారన్నారు.
Also Read:Allu Arjun: హ్యాపీ బర్త్ డే బన్నీ