కింగ్ నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `మన్మథుడు 2`. మనం ఎంటర్‌ప్రైజస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయ్‌కామ్ 18 స్టూడియోస్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ (జెమిని కిరణ్) నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఒక షెడ్యూల్ మినహా సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. త్వరలోనే ఈ షెడ్యూల్ చిత్రీకరణకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన నాగార్జున స్టైలిష్ లుక్‌తో పాటు నాగార్జున- రకుల్, నాగార్జున- కీర్తిసురేష్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.
సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలున్నాయి.ఇక ఈ చిత్ర టీజర్‌ని తాజాగా విడుదల చేశారు. ఈ టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. టీజర్‌లోని డైలాగ్స్‌ని బట్టి చూస్తుంటే చాలా కాలం తర్వాత నాగార్జున ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో అలరించనున్నాడని తెలుస్తుంది. ఆగస్ట్ 9న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్టు టీజర్ ద్వారా ప్రకటించారు.