బీజేపీ వ‌స్తే ఇవే చివ‌రి ఎన్నిక‌లు…

17
- Advertisement -

దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇవే చివరి ఎన్నికలు అవుతాయని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ మండిపడ్డారు.డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ దేశానికి అందించిన రాజ్యాంగాన్ని కాపాడేందుకు తాము ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నామ‌ని చెప్పారు. బీజేపీ ద‌క్షిణాదిలో క‌నుమ‌రుగ‌వుతుంద‌ని, ఉత్త‌రాదిలో స‌గానికి ప‌రిమిత‌మ‌వుతుంద‌ని ఆయ‌న జోస్యం చెప్పారు.

మోడీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే దేశానికి ఇవే చివ‌రి ఎన్నిక‌ల‌వుతాయ‌ని, అందుకే మోదీ స‌ర్కార్‌ను నిలువ‌రించేందుకు ఇండియా కూట‌మి బ‌రిలో నిలిచింద‌ని తెలిపారు. తొలి ద‌శ పోలింగ్ అనంత‌రం జూన్ 4న దేశంలో మార్పు త‌థ్య‌మ‌ని తాము నిస్సందేహంగా చెబుతున్నామ‌ని అన్నారు. జూన్ 4 త‌ర్వాత విప‌క్ష ఇండియా కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటవుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

Also Read:KTR:బడే భాయ్..చోటా భాయ్..ఇద్దరు మోసగాళ్లే

- Advertisement -