- Advertisement -
మాదిగల నిరసనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుర్కోవాల్సిందేనన్నారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన మందకృష్ణ…రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు మాదిగలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం అన్నారు.
నవంబర్ 4 నుండి 14 వరకు మాదిగల ధర్మ యుద్ధ దీక్షలు చేపడతాం అన్నారు. కోదాడ నుండి నవంబర్ 16 నుండి డిసెంబర్ 20 వరకు మాదిగల ధర్మయుద్ద రథ యాత్ర మొదలుపెడతాం…మా ఆవేదన ఇంకా పరిక్షిస్తే ఇంకా ప్రభుత్వం యుద్ధం చేస్తూ…సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం అన్నారు.
Also Read:TTD:19న శ్రీవారి ఆర్జితసేవా ఆన్లైన్ టికెట్లు రిలీజ్
- Advertisement -