హాకీ ఆటగాడు మన్‌దీప్‌ సింగ్‌కు కరోనా..

232
mandeep singh
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే క్రీడా రంగానికి చెందిన పలువురు కరోనా బారీన పడగా భారత పురుషుల హాకీ జట్టు ఆటగాడు మన్‌దీప్ సింగ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

ఎలాంటి లక్షణాలు లేకపోయినా మన్‌దీప్‌కు కరోనా సోకింది. 20 మంది ఆటగాళ్లకు కరోనా పరీక్షలు చేయగా అందులో మన్‌దీప్‌సింగ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఎస్‌ఏఐ తెలిపింది.

ఇప్పటికే కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, సురేందర్ కుమార్, జస్కరన్ సింగ్, వరుణ్ కుమార్, క్రిషన్ పాథక్‌లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్ధితి నిలకడగానే ఉందని కోచ్ వెల్లడించారు.

- Advertisement -