పాటలో రెడ్డి లేదని..రేవంత్‌ ఆ పనిచేశాడు!

12
- Advertisement -

అందెశ్రీ రాసిన పాటలో రెడ్డి లేదని మిగితా కులాల పేర్లు తీసేయించాడని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు మందకృష్ణ మాది. మీడియాతో మాట్లాడిన ఆయన.. అందె శ్రీ పాటను మార్చి..దానికి అర్థం లేకుండా చేశారన్నారు.

కొత్తగా తీసుకొచ్చిన పాటను తెలంగాణ సమాజం అమోదించడం లేదన్నారు. సమక్క సారక్క, కుమ్రంభీమ్‌ పేర్లను తొలగించడం సరికాదని.. కంచర్ల గోపన్నతో సహా కవుల పేర్లు గీతంలో ఏవని ప్రశ్నించారు.

రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ తోరణాన్ని ఎందుకు తొలగిస్తున్నారని… సమ్మక్క సారక్కను కాకతీయులు చంపితే.. గిరిజనులను పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్‌ కాదా అని నిలదీశారు. చార్మినార్ మన వారసత్వ సంపద…రాష్ట్ర చిహ్నాన్ని మార్చే ప్రయత్నం చేస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Also Read;రాష్ట్రాన్ని తాకిన నైరుతి..

- Advertisement -