Manda Krishna:ఈ విజయం వారికి అంకితం

5
- Advertisement -

న్యాయం కోసం ఎమ్మార్పీఎస్‌కు అండగా నిలిచిన వారందరికీ ఈ విజయం అంకితం ఇస్తున్నామన్నారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. 20 ఏండ్ల పోరాటానికి ఫలితం దక్కిందని చెప్పుకొచ్చారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో స్పందించిన మందకృష్ణ.. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందన్నారు.

ర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకే ఉందని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ఈ విజయం కోసమే 30 ఏండ్లుగా పోరాటం చేస్తున్నామన్నారు. ఈ పోరాటంలో చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయారని…. ఉద్యమాలను దెబ్బతీసే కుట్రలు ఎన్నో జరిగాయని విమర్శించారు.

1994లో ప్రకాశం జిల్లా ఈదుమూడిలో వర్గీకరణ ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు పోరాడామన్నారు. . ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని 2004 నవంబర్‌ 5న చెప్పానని గుర్తుచేశారు. త్వరలో విజయోత్సవ సభ నిర్వహిస్తామని, సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతామన్నారు.

Also Read:KTR : ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం

- Advertisement -