విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ సినిమాను మోహన్ బాబు అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నప్ప చిత్రాన్ని ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. సినిమాకు సంబంధించి ప్రతీ సోమవారం చిత్రంలోని పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇస్తూ వస్తున్నారు.
రుద్రుడిగా ప్రభాస్ ,శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతీ మాతగా కాజల్ , మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం వంటి నటుల లుక్‌ని విడుదల చేసి ఆకట్టుకుంటున్నారు విష్ణు. ఇక ఈ సినిమాకు తొలుత బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఒప్పుకోలేదని సమాచారం.
ఏకంగా రెండు సార్లు అక్షయ్ కుమార్ నో చెప్పగా ఓ బాలీవుడ్ డైరెక్టర్ సూచనతో అక్షయ్ కన్నప్ప మూవీలో నటించేందుకు ఒప్పుకున్నాడని మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈతరం ప్రేక్షకులకు శివుడిగా అక్షయ్ కుమార్‌నే చూపెట్టాలని తాను భావించానని.. అందుకే పట్టువదలకుండా అక్షయ్ కుమార్‌ను ఈ సినిమాలో నటించేందుకు ఒప్పించానని విష్ణు తెలిపారు.
Also Read:మైక్రోసాఫ్ట్‌తో ప్రభుత్వం ఎంవోయూ