హ్యపీ బర్త్‌డే మంచు విష్ణు..

255
MANCHU VISHNU LUCKKUNNODU
MANCHU VISHNU LUCKKUNNODU
- Advertisement -

విలక్షణ నటుడు మోహన్ బాబు నటవారసుడు మంచు విష్ణు తనదైన బాణీ పలికించడానికి తపిస్తున్నాడు… తొలి సినిమా నుంచీ వైవిధ్యం కోసం పరితపిస్తున్న విష్ణు పుట్టినరోజు నేడు… తండ్రి విలక్షణ నటుడిగా వందలాది పాత్రలకు సలక్షణంగా జీవం పోశారు… అదే రూటులో సాగాలని… జనాన్ని పులకరింపచేయాలని విష్ణు ఎంతగా తపించినా, ఆరంభంలో అతణ్ణి పరాజయాలే పలకరించాయి. అయితే తండ్రి నుండి అలవడ్డ పట్టుదలే విష్ణును కుంగిపోకుండా చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. పట్టువదలని విక్రమార్కునిలా సాగుతున్న విష్ణుకు ‘ఢీ’ రూపంలో తొలి విజయం లభించింది. ఈ సినిమా సక్సెస్ విష్ణుకు కొండంత ఊరటనివ్వడమే కాదు, ఆ తరువాత కూడా అతను వైవిధ్యం కోసం పరుగులు తీసేలా చేసింది. అలాగే విష్ణు సినిమాల టైటిల్స్ లో ‘డి’ లెటర్ ఉంటే హిట్టవుతాయనే సెంటిమెంట్ కూడా ఉంది. ఆ సెంటిమెంటుతో కొన్ని విజయాలు విష్ణు ఖాతాలో చేరాయి.

manchu vishnu

‘డీ’ సినిమా విజయం తరువాత కూడా విష్ణును కొన్ని సినిమాలు నిరాశపరిచాయి. తమ సొంత సంస్థ ‘ట్వంటీఫోర్ ఫ్రేమ్స్’ పతాకంపై ‘దేనికైనా రెడీ’ చిత్రాన్ని నిర్మించి, నటించాడు విష్ణు… ఈ సినిమా ‘ఢీ’కి రెట్టింపు విజయాన్ని సొంతం చేసుకుంది. ‘ఢీ, దేనికైనా రెడీ’ రెండూ ‘డి’ అక్షరంతో మొదలై విష్ణుకు విజయాలను తెచ్చిపెట్టాయి… అదే తీరున తన తరువాతి చిత్రానికి కూడా ‘దూసుకెళ్తా’ అన్న టైటిల్ ను పెట్టుకొని మరోమారు తనకు ‘డి’ సెంటిమెంట్ పనిచేస్తుందని నిరూపించుకున్నారు విష్ణు… అయితే మొన్న వచ్చిన ‘డైనమైట్’ విషయంలో మాత్రం ఆ సెంటిమెంట్ పనిచేయలేదు.

ప్రస్తుతం విష్ణు హీరోగా ‘లక్కున్నోడు’ అనే సినిమా తెరకెక్కుతుంది. ఎం.వి.వి.సినిమా బ్యాన‌ర్‌పై ఎం.వి.స‌త్యనారాయ‌ణ నిర్మిస్తున్న ఈ చిత్రం టాకీపార్ట్‌ను పూర్తి చేసుకుంది. గీతాంజ‌లి, త్రిపుర వంటి హ‌ర్ర‌ర్ కామెడి చిత్రాలతో మంచి విజ‌యాల‌ను సాధించిన ద‌ర్శ‌కుడు రాజ్‌కిర‌ణ్ ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను తెర‌కెక్కిస్తున్నారు. బ‌బ్లీ బ్యూటీ హ‌న్సిక మోత్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. దేనికైనా రెడీ, పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద హిట్స్ త‌ర్వాత మంచు విష్ణు, హ‌న్సిక హ్యాట్రిక్ హిట్ కోసం జ‌త క‌ట్టడంతో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. త్వర‌లోనే ఆడియో విడుద‌ల చేసి డిసెంబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్. విష్ణు మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ మరింతగా వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తాడని కోరుకుంటూ greattelangaana.com తరపున విష్ణుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం..

https://youtu.be/dZnAF4_X1xI

- Advertisement -