హిలేరియస్ ఎంటర్‌టైనర్ గా విష్ణు ‘లక్కున్నోడు’

89
Lakkunnodu

మంచు విష్ణు-హన్సిక జంటగా తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ “లక్కున్నోడు”. “గీతాంజలి” ఫేమ్ రాజ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని “యు/ఎ” సర్టిఫికెట్ అందుకొంది. ఎం.వి.వి సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 26న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

lakkunnodu

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ.. “రోమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శకుడు రాజ్ కిరణ్ సన్నివేశాలను తెరకెక్కించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. డైమండ్ రత్నబాబు స్క్రీన్ ప్లే-మాటలు ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తాయి. “దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద” లాంటి సక్సెస్ ఫుల్ ఫిలిమ్స్ తర్వాత విష్ణు-హన్సిక జంటగా నటిస్తున్న చిత్రం హ్యట్రిక్ విజయం సాధిస్తుందన్నారు. అలాగే “ఈడోరకం ఆడోరకం” వంటి సూపర్ హిట్ అనంతరం మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం అవ్వడంతో “లక్కున్నోడు”పై మంచి అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొన్నాయి. సినిమా కూడా అదే స్థాయిలో వారిని అలరిస్తుందని నమ్మకంగా చెప్పగలనన్నారు.

జనవరి 26న ప్రపంచవ్యాప్తంగా “లకున్నోడు” చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మా బ్యానర్ లో మరో సూపర్ హిట్ గా నిలుస్తుందన్న నమ్మకం ఉంది” అన్నారు.

తనికెళ్లభరణి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి కళ: చిన్నా, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, సంగీతం: అచ్చు-ప్రవీణ్ లక్కరాజు, స్క్రీన్ ప్లే-మాటలు: డైమండ్ రత్నబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రెడ్డి విజయ్ కుమార్, నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ, కథ-దర్శకత్వం: రాజ్ కిరణ్