డిసెంబర్‌లోనే కన్నప్ప.. విష్ణు హిట్ కొట్టేనా?

18
- Advertisement -

డైనమిక్ హీరో విష్ణు మంచు ‘కన్నప్ప’ ప్రాజెక్ట్ మీద దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవలె విడుదల చేసిన టీజర్‌తో కన్నప్ప క్రేజ్ మరింతగా పెరిగింది. కన్నప్ప ఓ విజువల్ వండర్‌లా ఉండబోతోందని అందరికీ అర్థమైంది. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ గురించి అందరూ మాట్లాడుకునేలా ఉండబోతోందని తెలుస్తోంది. ఇక కన్నప్ప ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. తాజాగా కన్నప్ప విడుదల గురించి విష్ణు మంచు మరోసారి క్లారటీ ఇచ్చారు.

కన్నప్ప చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేస్తామని ఇది వరకే ప్రకటించారు. తాజాగా మరోసారి ఈ విషయాన్ని విష్ణు మంచు నొక్కి చెప్పారు. ఈ మేరకు ఆయన వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. కన్నప్ప ఈ ఏడాది డిసెంబర్‌లోనే వస్తుందని చెప్పేశారు. ప్రస్తుతం విష్ణు మంచు ట్వీట్ నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది.

అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఈ చిత్రాన్ని పద్మశ్రీ డా.మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టీఫెన్ దేవస్సీ సంగీతాన్ని అందిస్తున్నారు. విజువల్ ట్రీట్ ఇచ్చేలా, ఇండియన్ స్క్రీన్ మీద మునుపెన్నడూ చూడనటువంటి గ్రాండియర్‌తో కన్నప్ప చిత్రం రానుంది.

మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్ వంటి భారీ తారగణంతో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి ఇక కంటిన్యూగా అప్డేట్లు రానున్నాయి. రీసెంట్‌గా విడుదల చేసిన శరత్ కుమార్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ఆయన నాథనాధుడిగా కనిపించనున్నారు.

Also Read:BMSలో ప్రభాస్ ఆల్-టైమ్ రికార్డ్

- Advertisement -