మా అధ్యక్షుడిగా మంచు విష్ణు…

38
manchu

ఉత్కంఠభరితంగా సాగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపొందారు. ప్రకాశ్‌ రాజ్ పై 107 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మంచు విష్ణు ప్యానల్ నుండి అత్యధిక మంది విజయం సాధించారు. చిన్న సెల‌బ్స్ నుండి స్టార్ హీరోల వ‌ర‌కు అంద‌రు విధిగా వ‌చ్చి త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.

ఎల‌క్ష‌న్స్ నేప‌థ్యంలో ప్ర‌కాశ్‌రాజ్‌- మంచు విష్ణు ఒక‌రిపై ఒక‌రు తీవ్ర ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. కానీ పోలింగ్ బూత్ ద‌గ్గ‌ర ఇద్ద‌రు ఆప్యాయంగా ప‌ల‌క‌రించుకోవ‌డం, హ‌గ్ చేసుకోవ‌డం అనంతరం ప‌లు సంద‌ర్భాల‌లో ఇద్ద‌రు క‌లిసి కామెడీలు కూడా చేశారు.

ఇక విజయం సాధించిన అనంతరం భావోద్వేగానికి లోనైన విష్ణు….ప్రకాశ్‌రాజ్‌ను పట్టుకుని ఏడ్చేశాడు. అనంతరం విష్ణు తన తండ్రి మోహన్‌బాబు ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విజయాన్ని తండ్రి మోహన్‌బాబుకు అంకితమిచ్చారు.