Kannappa: క‌న్న‌ప్పలో మోహ‌న్ బాబు మనవరాళ్లు

2
- Advertisement -

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భారీ ఎత్తున ‘కన్నప్ప’ మూవీ రాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ కేటాయించి డా.మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. కన్నప్ప మూవీని 25 ఏప్రిల్, 2025న భారీ ఎత్తున అన్ని భాషల్లో రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటించారు.

ఈ సినిమాలో ఇప్ప‌టికే మంచు విష్ణు కొడుకు న‌టిస్తుండ‌గా.. తాజాగా మంచు విష్ణు ఇద్ద‌రు కూతుళ్లు అయిన‌ అరియానా, వివియానా క‌న్న‌ప్ప సినిమాలో న‌టిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇవాళ అరియానా, వివియానా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా.. ఈ విష‌యాన్ని మోహ‌న్ బాబు తెలుపుతూ.. క‌న్న‌ప్ప సినిమాతో నా మ‌న‌వ‌రాల్లు అరియానా, వివియానా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందిస్తున్నాను అని చెప్పారు.

 

Also Read:రేవంత్ రెడ్డి అపరిచితుడు: హరీశ్‌

- Advertisement -