మా విషయంలో కొంత మంది మీడియా లిమిట్స్ క్రాస్ చేశారు అన్నారు మంచు విష్ణు. మీడియాతో మాట్లాడిన ఆయన..మీడియా వ్యక్తులకు కూడా తండ్రి, అన్నదమ్ములు ఉంటారు.. ఎవరి కుటుంబం పర్ఫెక్ట్‌గా ఉండదు అన్నారు. ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి..మోహన్ బాబు మీడియాకు రెస్పెక్ట్ ఇస్తారు.. మూడు తరాలుగా మోహన్ బాబు గురించి అందరికి తెలుసు అన్నారు.
మా నాన్న దేవుడు.. నాన్న అంటే నాకు ప్రాణం అన్నారు మనోజ్. మీడియా మిత్రులకు క్షమాపణలు చెబుతున్నా…మీడియాపై దాడి చేయడం బాధ కలిగించిందన్నారు. మా నాన్న ను మా అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేశారు…మా నాన్న దృష్టిలో నన్ను శత్రువు గా చిత్రీకరించారు అన్నారు. నేను నా భార్య కలిసి ఒక టాయ్స్ కంపెనీ పెట్టాము…వాటికి కూడా అడ్డంకులు సృష్టించారు అన్నారు.
నా పై దాడులు చేశారు..మా నాన్న ముందే నన్ను కొట్టారు అన్నారు. నాకు సపోర్ట్ చేస్తున్న మా అమ్మ ను కూడా డైవర్ట్ చేశారు, మూడు రోజులు బయటకు వెళ్ళు, మనోజ్ కి సర్ధిచెప్తాం అని మా అమ్మను కూడా నమ్మించారు అన్నారు. నా భార్య, ఏడు నెలల కూతురి పేరు లాగుతున్నారు…నేను నా సొంత కాళ్ల మీద నిలబడుతున్నాను, నేను ఎవరిని ఆస్తి అడగలేదు అన్నారు మనోజ్.
Also Read:పవన్,యుఎస్ ఎన్నికలు..వెతికింది వీటి గురించే!