మంచు విష్ణుకు వరలక్ష్మీ పుట్టింది

697
manchu Vishnu Family
- Advertisement -

టాలీవుడ్ హీరో మంచు విష్ణు భార్య విరానికా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈవిషయాన్ని విష్ణు తన ట్వీట్టర్ ద్వారా అభిమానులతో తెలిపారు. “ఇట్స్ ఏ గాళ్, ఇట్స్ ఏ గాళ్” అంటూ లవ్ సింబల్స్ తో తన ఆనందాన్ని పంచుకున్నారు . ఇవాళ శ్రావణ శుక్రవారం, పైగా వరలక్ష్మీ వ్రతం శుభఘడియలు కావడంతో మంచు వారింట ఆనందం వెల్లివిరుస్తోంది.

దీంతో వరలక్ష్మీ వ్రతం నాడు ఆడపిల్ల పుట్టింది కాబట్టి ఆ లక్ష్మీదేవి మీ ఇంట అడుగుపెట్టినట్టే. ఇకపై మీకు అన్నీ శుభాలే’ అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రముఖులు మంచు విష్ణుకు శుభాకాంక్షాలు తెలియజేస్తున్నారు. విష్ణు దంపతులకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు వివియానా, ఆరియానా, అవ్రమ్‌ లు ఉన్న విషయం తెలిసిందే.

- Advertisement -