విష్ణు ఆశలన్నీ ‘జిన్నా’పైనే!

182
- Advertisement -

గత కొంతకాలంగా హిట్ లేకుండా బాధపడుతున్న మంచు విష్ణు తాజాగా నటిస్తున్న చిత్రం జిన్నా. రీసెంట్‌గా మోసగాళ్లకు మోసగాడు చిత్రంతో మెప్పించలేకపోయిన విష్ణు..ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. తొలుత అక్టోబర్ 5న సినిమా రిలీజ్ కానుందని ప్రకటించిన ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో అంతా సందిగ్దం నెలకొంది.

అయితే సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేశారు మంచు విష్ణు. అక్టోబర్ 21న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా, ప్రేక్షకులు మెచ్చే విధంగా తెరకెక్కించామని.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా అలరిస్తుందని అన్నారు.

విష్ణు సరసన అందాల భామలు పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్‌లు నటంచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సూర్య డైరెక్ట్ చేస్తుండగా, అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -