మంచు వారి పెళ్లి వీడియో..!

63
- Advertisement -

మంచు వారి కుటుంబంలో మంచు మనోజ్‌ దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండవ కూతురు భూమా మౌనికా రెడ్డిని గతనేల ఘనంగా వివాహం చేసుకున్న సంగంతి తెలిసిందే. అయితే తాజాగా వీరిపెళ్లికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. దాంతో పాటుగా ఏం మనసో..ఎం మనసో అంటూ ఓ పాటను వీడియోకు జత చేశారు. అయితే వీరిపెళ్లి మాత్రం మంచు లక్ష్మి ఇల్లు వేదికైంది.

Also read: మమ్మీ కాబోతున్న గోవా బ్యూటీ.. నిజమెంత..!

అత్యంత సన్నిహితుల నడుమ జరిగిన వివాహ వేడుకలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తల్లి విజయమ్మ కూడా వచ్చి నూతన వదువరులను ఆశీర్విందించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అచ్చు రాజమని కంపోజ్ చేసి ఆలపించిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. పెళ్లికి సంబంధించిన ముఖ్యమైన వేడుకలన్ని ఈ వీడియోలో చూపించారు. హల్దీ ఫంక్షన్‌, రింగులు మార్చుకోవడం సహా పెళ్లికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను చూపించారు.

Also read: ‘హను-మాన్‌’ షూటింగ్ పూర్తి

ఈ వీడియోలో మోహన్‌బాబు, మౌనిక రెడ్డి కళ్లు తుడవడం. హత్తుకోవడం వంటివి కాస్త ఎమోషనల్‌గా అనిపించాయి. ఇక వీడియో చివరి నలబై సెకన్ల నిడివిలో ఇది శివుని ఆజ్ఞ అంటూ మనోజ్‌, భూమా మౌనికారెడ్డి, ఆమె తనయుడి చేతులు ఒకరిపై ఒకరు వేసుకుని ఉండటం వీడియోకే హైలెట్‌గా నిలిచింది.

- Advertisement -